Laila OTT: ఓటీటీలోకి రానున్న విశ్వక్ సేన్ ‘లైలా’.. ఎప్పటి నుంచంటే..?

by Phanindra |

ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయింది.

Laila OTT: ఓటీటీలోకి రానున్న విశ్వక్ సేన్ ‘లైలా’.. ఎప్పటి నుంచంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) నటించిన ‘లైలా’ ( Laila ) మూవీ ఎన్నో సమస్యలను ఎదుర్కొని ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో వన్ మ్యాన్ షో చేసినప్పటికీ ఈ మూవీ సినీ లవర్స్ కి ఎక్కలేదు.

నారాయణ్ ( Narayan ) డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి ( Sahu Garapati ) నిర్మించారు. మొదటి నుంచి నుంచి భారీ అంచనాలున్నప్పటికీ.. థియేటర్ లో బొమ్మ పడిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. రిలీజ్ అవ్వక ముందు వరకు సినిమా బాగుంటుందన్నవారు కూడా "ఇదేం సినిమారా " బాబు అంటూ బయటకొచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మూవీ రిలీజ్ అయిన ఒక్కరోజుకే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలిసిన సమాచారం. దీంతో, ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ అనంతరం ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ , ఇప్పుడు ఈ మూవీకి వచ్చిన టాక్ బట్టి చూస్తే.. చెప్పిన దానికంటే ముందుగానే ‘లైలా’ చిత్రం ఓటీటీలోకి వస్తుందని సమాచారం. అంటే, ఫిబ్రవరి చివరి వారంలో స్ట్రీమింగ్ కానుంది.

Next Story