- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Laila Teaser : లైలా టీజర్ రిలీజ్ .. అమ్మాయి గెటప్ లో హీరోయిన్ లా మెరిసిపోతున్న విశ్వక్ సేన్
తాజాగా, ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది

దిశ, వెబ్ డెస్క్ : హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. సినిమాల్లోకి అడుగు పెట్టిన మొదట్లో మైక్ పట్టుకుంటే చాలు అన్నీ మాట్లాడేవాడు. క్రమం క్రమంగా అతను చేసిన తప్పులను తెలుసుకుంటూ సరి చేసుకుంటూ వస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన " మెకానిక్ రాకీ "మూవీ యావరేజ్ గా నిలవగా.. ప్రస్తుతం " లైలా" ( Laila ) అనే కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ టీం ప్రమోషనల్ పనుల్లో స్పీడ్ పెంచారు. తాజాగా, ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది. అమ్మాయి గెటప్ లో విశ్వక్ చాలా బాగా నటించాడు.
విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ పతాకం పై పై సాహు గారపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందివ్వగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీగా వర్క్ చేశారు.






