- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishwak Sen: చాలెంజ్ ఏం అయిందమ్మా అంటూ విశ్వక్ సేన్ పోస్ట్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), రామ్ నారాయణ్ (Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’ (Laila).

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen), రామ్ నారాయణ్ (Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’ (Laila). ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. పాజిటివ్ అంచనాల మధ్య ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ (trailer)ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్‌లో విశ్వక్ మొదట లేడీస్ బ్యూటీ పార్లర్ (Ladies beauty parlour) నడుపుతున్న బార్బర్ సోనుగా దర్శనమిచ్చి.. తర్వాత కొన్ని కారణాల చేత లైలాగా మారతాడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో, కామెడీ పంచులతో ఆకట్టుకున్న ఈ ట్రైలర్ ప్రజెంట్ టాప్ ట్రెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగానే విశ్వక్ సేన్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ X ద్వారా స్పందిస్తూ.. ‘చాలెంజ్ ఏం అయిందమ్మా.. ట్రైలర్ ట్రెండింగ్ #1’ లో ఉంది అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెగిటివ్ కామెంట్స్‌తో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు.
‘అన్నా నువ్వు ఒక్కప్పుడు ‘ఫలక్‌నుమా దాస్, ENE (ఈ నగరానికి ఏమైంది’, HIT సినిమాలూ తీశావు గుర్తుందా? ఇప్పటికి వరకు HIT సిరీస్‌లోనే యాక్టింగ్‌లో నీ దగ్గరకు కూడా ఎవడు రాలే. ఏం అపుతుందీ నిన్ను మళ్లీ అలాంటి సినిమాలే తియ్యకుందా??’ అని ‘ఉమ్మితే వర్షం అనుకుంటున్నావు భయ్యా’ అని ‘పాజిటివ్ చేసిన నెగిటివ్ చేసిన టాప్‌లోకే వస్తాయి.. కానీ నువ్వు పాజిటివ్ చేశారు అనుకుంటున్నావు అంతే’ అంటూ నెగిటివ్ కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు. అయితే.. విశ్వక్ ఫ్యాన్స్ మాత్రం మనకి ఇవన్ని ఎందుకు అన్నా మళ్లి ‘ఫలక్‌నుమా దాస్, HIT’ లాంటి సినిమాలు తియ్యి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక కొందరు మాత్రం విశ్వక్ ఈ పోస్ట్ ఎవరి కోసం పెట్టాడో తెలియక సతమతమవుతున్నారు. కాగా.. ‘లైలా’ చిత్రం షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తుండగా.. ఇందులో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.
Challenge yemaindhamma ? Trailer trending #1
— VishwakSen (@VishwakSenActor) February 7, 2025






