Vishnupriya: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

by Pulgam srinivas |   (  Updated:2026-05-11 08:23:57  IST  )

ప్రస్తుతం విష్ణుప్రియకి ఇన్‌స్టాగ్రామ్‌లో 9,339 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. దీంతో నెలకు దాదాపు రూ. 40 లక్షల వరకు ఆదాయం వస్తోందని టాక్ నడుస్తోంది.

Vishnupriya: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల సబ్‌స్క్రిప్షన్స్ అనే కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా వినియోగదారులు కొంత మొత్తాన్ని చెల్లించిన తర్వాత మాత్రమే ప్రత్యేక వీడియోలు, ఫోటోలు వంటి కంటెంట్‌ను చూడగలరు. దీంతో కొంతమంది సెలబ్రిటీలు తమ ప్రత్యేక కంటెంట్‌ను కేవలం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందిస్తున్నారు. సెలబ్రిటీల కంటెంట్ కావడంతో అభిమానులు కూడా డబ్బులు చెల్లించి వాటిని వీక్షిస్తున్నారు.

ఇక కొంతకాలం క్రితం ప్రముఖ నటి, యాంకర్ విష్ణు ప్రియ తనకు సంబంధించిన బోల్డ్ కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసి, అది కేవలం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే కనిపించేలా చేసింది. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇప్పటికీ ఆమె ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అనేకమంది ఆమె అకౌంట్‌కు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9,339 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. దీంతో నెలకు దాదాపు రూ. 40 లక్షల వరకు ఆదాయం వస్తోందని టాక్ నడుస్తోంది. ఈ విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని ఆమె భారీగా ఆదాయం సంపాదిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆ బంధంపై ఆసక్తి పోతోంది.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్..

Next Story