- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vishnupriya: ఇద్దరం అందంగా ఉన్నామంటూ బ్యూటిపుల్ లొకేషన్‌లో ఉన్న ఫొటోలు షేర్ చేసిన నటి..
యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తర్వాత బుల్లితెర యాంకర్‌గా అవకాశం దక్కించుకుని.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. పోవే పోరా షోతో ఈ భామ యాంకర్‌గా మారింది. ఈ షోలో సుడిగాలి సుధీర్‌కు జోడిగా యాంకరింగ్ చేసి ఫేమస్ అయ్యింది. తర్వాత మెల్లిమెల్లిగా వెండితెరపై అవకాశాలు కొట్టేసింది. వాంటెడ్ పండుగాడ్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా కూడా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.
ఈ మూవీలో విష్ణుప్రియతో పాటు సునీల్, అనసూయ, వెన్నెల కిశోర్, సుడిగాలి సుధీర్ వంటి వారు కీలక పాత్రల్లో నటించి జనాల్ని ఆకట్టుకున్నారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీసు వద్ద ఆడలేదు కానీ విష్ణుప్రియ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. వీటితో పాటుగా ఈ బ్యూటీ దయ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఇందులో లేడీ జర్నలిస్ట్ రోల్‌లో కనిపించి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈషా రెబ్బా, జేడీ చక్రవర్తి కూడా ముఖ్య పాత్రలో నటించారు.
జనాల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న దయ వెబ్ సిరీస్ కు కొనసాగింపు కూడా ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఇదంతా పక్కన పెడితే.. ఇకపోతే తాజాగా విష్ణుప్రియ వెకేషన్‌కెళ్లినా ఫొటోలు అభిమానులతో పంచుకుంది. ఈ బ్యూటీ బాలికి వెళ్లినట్లు తెలుస్తోంది. బ్యూటిఫుల్ లొకేషన్‌లో ఉన్న ఫొటోలు పంచుకుని..‘నేను బాలి అందంగా ఉన్నాను. మీరు నా బయోలోని వ్లాగ్ లింక్‌ని తప్పక చూడండి’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాంకర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






