క్లైమాక్స్ మార్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నాం.. కచ్చితంగా ఆడియన్స్‌కు నచ్చుతుంది: విష్ణు విశాల్

by Chukka Sudharani |

విష్ణు విశాల్ లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’.

క్లైమాక్స్ మార్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నాం.. కచ్చితంగా ఆడియన్స్‌కు నచ్చుతుంది: విష్ణు విశాల్
X

దిశ, సినిమా: విష్ణు విశాల్ లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ చిత్రం నవంబర్ 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘తెలుగు ఆడియన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీరు నా సినిమాలు రాక్షసన్, ఎఫ్ఐఆర్, మట్టి కుస్తీ చాలా ప్రేమతో సపోర్ట్ చేశారు. రాక్షసన్ స్ట్రాంగ్ థ్రిల్లర్. ఎఫ్ఐఆర్ యాక్షన్ ఎమోషనల్ జర్నీ. మట్టి కుస్తీ ఫన్ ఎంటర్టైనర్. ఇప్పుడు ఆర్యన్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. యూనిక్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. తెలుగు ఆడియన్స్ నాకు ఎప్పుడు చాలా గొప్ప ప్రేమను అందించారు. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి సినిమా చేయడం చాలా చాలెంజింగ్. తప్పకుండా ఆడియన్స్‌కి సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఈ సినిమా తమిళ్ లో చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమా క్లైమాక్స్ గురించి తమిళ్‌లో మిక్సిడ్ ఒపీనియన్ వచ్చింది. తెలుగులో క్లైమాక్స్ మార్చి రిలీజ్ చేస్తున్నాం.. ఆడియన్స్‌కు తప్పకుండా మార్చిన క్లైమాక్స్ నచ్చుతుంది. నవంబర్ 7 సినిమా వస్తోంది., అందరూ సినిమాని థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. ‘డాకు మహారాజ్ తర్వాత మళ్లీ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆర్యన్ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 31 సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా సినిమాని చాలా అద్భుతంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఇందులో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేశాను. అందరూ సినిమాని థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను’ అని తెలిపింది.

Next Story