- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ విష్ణు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రీ పోన్ అయిన విష్ణు విన్యాసం
విష్ణు విన్యాసం మూవీని ఫిబ్రవరి 28వ తేదీన కాకుండా 27వ తేదీనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ విష్ణు తాజాగా విష్ణు విన్యాసం అనే చిత్రంలో హీరోగా నటించాడు. నయన్ సారిక ఇందులో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున ప్రచారాలను కూడా చేశారు. తాజాగా ఈ సినిమా విడుదలను మేకర్స్ ప్రీ పోన్ చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. విష్ణు విన్యాసం సినిమాని ఫిబ్రవరి 28వ తేదీన కాకుండా 27వ తేదీనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలా విష్ణు విన్యాసం సినిమా ముందు ప్రకటించిన తేదీతో పోలిస్తే ఒకరోజు ముందుగానే విడుదల కానుంది. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ మూవీని అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ను విడుదల చేయగా అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.






