- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్ పూర్తి చేసుకున్న విష్ణు విన్యాసం.. రన్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
విష్ణు విన్యాసం చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికెట్ లభించగా, ఈ చిత్రాన్ని కేవలం 1 గంట 59 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ విష్ణు, నవీన్ సారిక జంటగా విష్ణు విన్యాసం అనే చిత్రం రూపొందింది. ఈ సినిమాని ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ కి సంబంధించిన విడుదల తేదీ దగ్గర పడడంతో, తాజాగా ఈ మూవీ బృందం వారు సెన్సార్ను పూర్తి చేశారు. అలాగే రన్ టైంను కూడా ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా రన్ టైంకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
కేవలం 1 గంట 59 నిమిషాల నిడివితో విష్ణు విన్యాసం మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు, ఆ రన్ టైం మొత్తం కూడా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారని ఈ మూవీ మేకర్స్ అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తక్కువ రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రానుండడం, శ్రీ విష్ణు కూడా ఈ సినిమా ఫుల్ కామెడీతో నిండిపోయి ఉంటుందని చెప్పడంతో ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. యదునాథ్ మారుతీరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.






