- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడుదలకు ముందే హిట్టు కొట్టేసిన విష్ణు విన్యాసం.. బడ్జెట్ 19 కోట్లు.. వచ్చిన లాభం అంతా
విష్ణు విన్యాసం చిత్రాన్ని 19 కోట్లలో పూర్తి చేయగా, థియేట్రికల్ హక్కుల ద్వారా 10 కోట్లు, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా 16 కోట్లు రావడంతో నిర్మాత లాభాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో సినిమాలపై పెట్టిన పెట్టుబడి మూవీ విడుదల తర్వాత రికవరీ కావడం కూడా ఎంతో కష్టంగా ఉందని అనేకమంది నిర్మాతలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలాంటి సమయంలో కూడా కొన్ని క్రేజీ సినిమాలు విడుదలకు ముందే నిర్మాతలకు లాభం తీసుకువస్తున్నాయి. అలా రిలీజ్ డేట్ కి ముందే నిర్మాత జేబును ఫుల్లుగా నింపేసిన చిత్రాలలో శ్రీ విష్ణు హీరోగా రూపొందిన విష్ణు విన్యాసం ఒకటిగా నిలిచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది.
విష్ణు విన్యాసం మూవీని దాదాపు 19 కోట్ల బడ్జెట్లో పూర్తి చేయగా, థియేట్రికల్ హక్కుల ద్వారా 10 కోట్లు, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా 16 కోట్లు, మొత్తంగా 26 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా రిలీజ్ కి ముందే ఏడు కోట్ల లాభాలను అందుకొని నిర్మాతకు లాభాలను తీసుకువచ్చినట్లు సమాచారం. రిలీజ్ ముందే ఈ సినిమా సేఫ్ కావడంతో ఒకవేళ ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే నిర్మాతకు మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీ విష్ణుకి జోడిగా నయన్ సారిక కనిపించబోతుంది. రథన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయనున్నారు. శ్రీ విష్ణు 'విష్ణు విన్యాసం'తో పాటు మృత్యుంజయ్ చిత్రంలో కూడా నటించాడు. దీనిని మొదట ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చి 6వ తేదీకి మార్చారు.






