హీరోయిన్‌తో విశాల్ పెళ్లి వాయిదా.. వచ్చే నెలలో ఓ గుడ్ న్యూస్ చెబుతానంటూ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్(Vishal) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

హీరోయిన్‌తో విశాల్ పెళ్లి వాయిదా.. వచ్చే నెలలో ఓ గుడ్ న్యూస్ చెబుతానంటూ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్(Vishal) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే అతనికి ప్రజెంట్ 47 ఏళ్లు. అయినప్పటికీ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో విశాల్ పెళ్లి పై ప్రతీసారి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే 2016 లో నటుల సంఘం భవన నిర్మాణం ప్రారంభమైనప్పుడు, ఆ భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ చెప్పిన సంగతి తెలిసిందే.

కానీ అనేక సమస్యల కారణంగా ఆ భవనం పూర్తి కావడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఆ భవన నిర్మాణం పూర్తి కాలేదు. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. తాను చెప్పినట్లుగానే నటుల సంఘం భవనం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు విశాల్. ఇక నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో, విశాల్ తను ప్రేమించి అమ్మాయి గురించి రీసెంట్‌గా అనౌన్స్ చేశాడు. హీరోయిన్ సాయి ధన్సికను ప్రేమిస్తున్నట్లు విశాల్ వెల్లడించారు.

యోగిత సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఇద్దరూ జంటగా పాల్గొని తమ ప్రేమ, పెళ్లి గురించి ప్రకటించారు. ఆగస్టు 29న తన పుట్టినరోజు సందర్భంగా తమ పెళ్లి జరుగుతుందని విశాల్ ప్రకటించారు. దీంతో విశాల్ - సాయి ధన్సిక(Sai Dhanshika) జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఈవెంట్‌లో విశాల్ మాట్లాడుతూ..‘ నడిగర్ భవనంలో తొలి పెళ్లి నాదే, ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నాను. ఆగస్టు 29న ఓ గుడ్ న్యూస్ చెబుతాను’ అని చెప్పుకొచ్చాడు. అంటే దీన్ని బట్టి ఆగస్టు 29న విశాల్ తన పెళ్లికి కొత్త ముహూర్తం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story