Vishal: ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన విశాల్.. సినిమాలకు దూరం అవ్వడంపై క్లారిటీ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ (వీడియో)

by Mallepaka Hamsa |

కోలీవుడ్ హీరో విశాల్(Vishal) గత కొద్ది రోజుల నుంచి వైరల్ ఫీవర్‌(Viral fever)తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Vishal: ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన విశాల్.. సినిమాలకు దూరం అవ్వడంపై క్లారిటీ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విశాల్(Vishal) గత కొద్ది రోజుల నుంచి వైరల్ ఫీవర్‌(Viral fever)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఈవెంట్‌లో చేతులు వణుకుతూ కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే.. ఆయన ఫీవర్‌తో బాధపడుతున్నట్లు డాక్టర్స్ కీలక ప్రకటన విడుదల చేయడంతో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. అయితే అనారోగ్యం కారణంగా విశాల్ సినిమాలకు దూరం అవుతున్నారనే ప్రచారం కూడా జరిగింది.

ఈ క్రమంలో.. తాజాగా, ‘మదగజ’(Madagaja) ప్రీమియర్‌కు హాజరై ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ‘‘మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన వల్లే ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. కొంతమంది నేను సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి వెళ్లిపోతానని అనుకుంటున్నారు. అనారోగ్య సమస్యల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని ప్రచారం జరుగుతోంది.

నాకు ఎలాంటి సమస్య లేదు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు కూడా వణకడం లేదు. మైక్‌ను కూడా కరెక్ట్‌గా పట్టుకోగలుగుతున్నా. నేను కోలుకోవాలని మీరు పెట్టిన మెసేజ్‌లు నన్ను కోలుకునేలా చేశాయి. నాపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అభిమానాన్ని నా చివరి శ్వాస వరకూ మర్చిపోను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

Next Story