- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త సినిమాతో వచ్చేసిన విశాల్...ఈ సారి డాన్ రోల్ !
స్వయంగా మకుటం ను తానే తీస్తున్నట్లు విశాల్ ప్రకటించేశారు. అంటే హీరో, దర్శకత్వం రెండు కూడా విశాల్ చేయనున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో హీరో విశాల్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా హీరో విశాల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన ఏ సినిమా తీసిన కచ్చితంగా తెలుగులో రిలీజ్ చేస్తారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసే విశాల్.. దీపావళి సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. మకుటం ( Makutam ) అనే సినిమాకు సంబంధించిన సెకండ్ పోస్టర్ స్వయంగా విశాల్ రిలీజ్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాను దర్శకుడు రవి అరసుతో విశాల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ ఇద్దరికీ గత కొన్ని రోజులుగా వివాదాలు చోటు చేసుకున్నాయట. దీంతో స్వయంగా ఈ సినిమాను తానే తీస్తున్నట్లు విశాల్ ప్రకటించేశారు. అంటే హీరో, దర్శకత్వం రెండు కూడా విశాల్ చేయనున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో మకుటం మూవీ సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా దర్శకత్వం కూడా తానే వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకు రీ- వర్స్ చేసి... నిర్మాతకు న్యాయం చేస్తానని తెలిపారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన మకుటం సినిమా ( Makutam Second Look ) పోస్టర్ లో డాన్ రోల్ లో విశాల్ కనిపిస్తాడని అంటున్నారు.






