- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishal: సడెన్‌గా ఎంగేజ్మెంట్.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్
హీరో విశాల్ (Vishal), సాయి ధన్సిక (Sai Dhansika) సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

దిశ, సినిమా: హీరో విశాల్ (Vishal), సాయి ధన్సిక (Sai Dhansika) సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. గతంలో ఓ సినిమా ఫంక్షన్‌లో ప్రేమ విషయాన్ని ప్రకటించిన ఈ జంట.. నడిగర్ సంఘం భవనం ప్రారంభోత్సవం తర్వాత వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించారు. దీంతో అంతా విశాల్ పెళ్లి డేట్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తుండగా.. సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని విశాల్ తెలుపుతూ..
‘నా పుట్టినరోజు స్పెషల్‌గా నేను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాను. ఈ శుభవార్తను పంచుకోవడం ఆనందంగా ఉంది. సాయిధన్సికతో పాటు మా కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను. ఎప్పటిలాగే మీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చాడు. ఇక మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నాకు సాయిధన్షికతో నిశ్చితార్థం జరిగింది. మా పెళ్లి ఈరోజే జరగాల్సి ఉంది. కానీ నడిగర్ సంఘం భవనం పూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ భవనంలోనే మా వివాహం ఘనంగా జరగాలి. మేము 9 సంవత్సరాలుగా వేచి ఉన్నాము.. ఇప్పుడు మరో 2 నెలలు వేచి ఉంటాము’ అంటూ తెలిపారు. లింక్






