- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vishal-Sai Dhansika : పెళ్ళిపై వార్తలు.. నిజమేనన్న విశాల్
by Muthe.Rajitha |
తమిళ స్టార్ హీరో విశాల్(Vishal), నటి సాయి ధన్సిక(Sai Dhansika)ల వివాహంపై సోమవారం నెట్టింట్లో విపరీతమైన ప్రచారం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ హీరో విశాల్(Vishal), నటి సాయి ధన్సిక(Sai Dhansika)ల వివాహంపై సోమవారం నెట్టింట్లో విపరీతమైన ప్రచారం జరిగింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియా కోడై కూసింది. అయితే తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ.. పెళ్ళిపై వస్తున్న వార్తలు నిజమేనని ఒప్పుకున్నారు. సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఓ సినిమా ఈవెంట్ కు విశాల్, సాయి ధన్సిక కలిసి వచ్చి.. తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు పెళ్ళిరోజును కూడా అనౌన్స్ చేసి అభిమానులను, సన్నిహితులను మరింత ఆశ్చర్యంలో ముంచారు. ఆగస్టు 29న తమ వివాహం జరగుతుందని.. ప్రేమ బంధాన్ని మరింత కొనసాగిస్తూ పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నామని పేర్కొన్నారు. దీంతో విశాల్ అభిమానులు, ఫ్రెండ్స్ ఆనందంలో మునిగిపోయారు.
Next Story






