Hero Vishal: స్టేజీపైనే కుప్పకూలిన హీరో విశాల్

by velandi.Saikiran |   (  Updated:2025-05-11 17:48:07  IST  )

స్టార్ హీరో విశాల్ అభిమానులకు మరో షాక్ తగిలింది. ఓ వేదికపైనే హీరో విశాల్ కుప్పకూలాడు. వేదికపై స్పృహ తప్పి హీరో విశాల్

Hero Vishal: స్టేజీపైనే కుప్పకూలిన హీరో విశాల్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో విశాల్ ( Vishal) అభిమానులకు మరో షాక్ తగిలింది. ఓ వేదికపైనే హీరో విశాల్ కుప్పకూలాడు. వేదికపై స్పృహ తప్పి హీరో విశాల్ పడినట్లు చెబుతున్నారు. తమిళనాడు విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి హీరో విశాల్ ప్రత్యేక అతిథిగా హాజరైయ్యాడు. ఈ తరుణంలోనే వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడట విశాల్. అయితే అక్కడ ఉన్న వారు, ఆయన అనుచరులు వెంటనే అలెర్ట్ అయ్యారు. హీరో విశాల్ ను ఆసుపత్రికి తరలించారు.

తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో హీరో విశాల్ కు ఎమర్జెన్సీలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం అందుతుంది. కానీ అధికారిక ప్రకటన వైద్యుల నుంచి మాత్రం రాలేదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... హీరో విశాల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా... ఇటీవల కాలంలోనే ఓ భయంకరమైన వ్యాధితో బాధపడిన విశాల్... మొన్న మొన్ననే కోలుకున్నాడు. ఇక ఇప్పుడు స్టేజ్ పైనే... కుప్పకూలడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Next Story