భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న విరూపాక్ష బ్యూటీ.. మెడలో మాల కనిపించడంతో షాక్ అవుతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-04 06:30:22  IST  )

యంగ్ బ్యూటీ సోనియా సింగ్(Sonia Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న విరూపాక్ష బ్యూటీ.. మెడలో మాల కనిపించడంతో షాక్ అవుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ సోనియా సింగ్(Sonia Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన ఈ చిన్నది అనతి కాలంలోనే అక్కడ పాపులారిటీ సంపాదించుకున్నది. తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో సినిమాల్లో నటించే చాన్స్ వచ్చింది. అలా ఫస్ట్ ‘విరూపాక్ష’(Virupaksha) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీలో ఈ చిన్నదాని క్యారెక్టరే మెయిన్ కావడంతో ఇంకా బాగా ఫేమస్ అయింది. అలా వరుస సినిమాల్లో నటిస్తూ ఉంది. అంతేకాకుండా ఈటీవీలో ‘యమలీల’(Yamaleela) అనే సీరియల్‌లో కూడా మెయిన్ రోల్ ప్లే చేసింది.

ప్రస్తుతం ఓ పక్క సినిమాలతో మరో పక్క సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ బిజీబిజీగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సోనియా సింగ్ కాశీలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తిగా భక్తి భావనలో లీనమైపోయిన ఆమె కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా ట్రెడిషనల్ శారీ, మెడలో మాలతో కనిపించిన ఫొటోస్‌కు షేర్ చేసింది. ఫ్ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇక మెడలో మాల ఉండటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Next Story