టికెట్ కొట్టు ఐఫోన్ పట్టు .. మీ అందరికి ‘వర్జిన్ బాయ్స్’ బంపర్ ఆఫర్

by Chukka Sudharani |

గీతానంద్ (Geetanand), మిత్రా శర్మ (Mitra Sharma) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’(Virgin Boys).

టికెట్ కొట్టు ఐఫోన్ పట్టు .. మీ అందరికి ‘వర్జిన్ బాయ్స్’ బంపర్ ఆఫర్
X

దిశ, సినిమా: గీతానంద్ (Geetanand), మిత్రా శర్మ (Mitra Sharma) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’(Virgin Boys). యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి దయానంద్ (Director Dayanand) దర్శకత్వం వహిస్తుండగా.. రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని నిర్మిస్తున్నారు. శ్రీహాన్(Srihan), జెన్నీఫర్ ఇమాన్యుల్(Jennifer Emanuel), రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా దర్శకుడు దయానంద మాట్లాడుతూ... ‘మేము కాలేజీ రోజుల్లో ఉండగా చేసిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా మొదలు పెట్టాము. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరికీ కనెక్ట్ అవుతాయి. చిత్రానికి చాలా మంచి బృందం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. స్మరణ్ సాయి (Music director Smaran Sai) సంగీతం ఈ సినిమాకు బోనస్‌గా నిలుస్తుంది. మా అన్నయ్య గీతానంద్‌తో నాకు ఇది రెండవ చిత్రం. అలాగే గీతానంద్, మిత్ర శర్మ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చింది. జూలై 11వ తేదీన ప్రేక్షకులంతా చూడవలసిన సినిమా వర్జిన్ బాయ్స్’ అన్నారు. అలాగే.. ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు మీపై వర్షంలో కురుస్తుందని, ఆ డబ్బును ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అంటూ తెలిపారు.

Next Story