ఓటీటీలోకి ‘వర్జిన్ బాయ్స్’ వచ్చేశారోచ్..

by Chukka Sudharani |

గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’.

ఓటీటీలోకి ‘వర్జిన్ బాయ్స్’ వచ్చేశారోచ్..
X

దిశ, సినిమా: గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించాడు. రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని నిర్మించారు. శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర సినిమాగా వచ్చినప్పటికీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ‘వర్జిన్ బాయ్స్’ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు ప్రకటించింది.

Next Story