Virgin Boys: బ్రో.. ఆర్ యు వర్జిన్?.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్

by Chukka Sudharani |   (  Updated:2025-04-07 14:57:34  IST  )

ప్రేక్షకులను నవ్వుల వర్షంతో ముంచెత్తేందుకు సిద్ధమైన రొమాంటిక్ కామెడీ (Romantic comedy) ఎంటర్‌టైనర్ ‘వర్జిన్ బాయ్స్’

Virgin Boys: బ్రో.. ఆర్ యు వర్జిన్?.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: ప్రేక్షకులను నవ్వుల వర్షంతో ముంచెత్తేందుకు సిద్ధమైన రొమాంటిక్ కామెడీ (Romantic comedy) ఎంటర్‌టైనర్ ‘వర్జిన్ బాయ్స్’ (Virgin Boys). గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ గురు ఫిలిమ్స్ పతాకంపై రాజా దరపునేని నిర్మిస్తుండగా.. దయానంద్ (Dayanand) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌(First look poster)ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ గమనించినట్లైతే.. ఓ అందమైన అమ్మాయి ముఖం, అందులో ఆమె పెదాలపై ముగ్గురు యువకులు విభిన్న శైలిలో కనిపించడం ఆకర్షణీయంగా ఉంది. పోస్టర్ చూస్తుంటే చాలా క్రేజీ వైబ్స్ వస్తున్నాయి.

ఈ పోస్టర్‌లో అమ్మాయి పెదాలపై ఒకరు కలర్‌ఫుల్ షార్ట్స్‌లో, మరొకరు స్కేట్‌బోర్డ్‌తో, మరోకరు మ్యాగజైన్‌తో నవ్వుతూ కనిపించడం ఈ సినిమా యొక్క హాస్య రాగాన్ని సూచిస్తోంది. 'బ్రో.. ఆర్ యు వర్జిన్?' (Bro.. are you a virgin?) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా యువతలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సమ్మర్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోన్న ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం యువకుల మధ్య నడిచే రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో చూపించనుందని అర్థం అవుతుండగా.. రిలీజ్ పోస్టర్‌తో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే.. ఈ మూవీ రిలీజ్‌పై త్వరలో క్లారిటీ రానుంది.

Next Story