- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైరెక్టర్ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: మోనాలిసా
సినిమా సెట్ లో తనతో సనోజ్ మిశ్రా అసభ్యంగా ప్రవర్తించారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు మోనాలిసా.

దిశ, వెబ్ డెస్క్: కుంభమేళా కారణంగా ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా ( Monalisa ) మరోసారి వార్తలు నిలిచారు. దర్శకుడు సనోజ్ మిశ్రాపై ( Director Sanoj Mishra) సంచలన ఆరోపణలు చేశారు. సినిమా సెట్ లో తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఒంటరి దాన్ని చేసి ఆడుకున్నారని షాకింగ్ నిజాలను బయటపెట్టారు మోనాలిసా. ఈ ఘటన జరిగినప్పుడు తాను మైనర్ అని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే దర్శకుడు సనోజ్ మిశ్రాపై ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటన చేశారు.
ఇటీవల ఫర్హాన్ ఖాన్ ను వివాహం చేసుకున్న మోనాలిసా, తన కుటుంబంపై కూడా ఆరోపణలు చేశారు. తన ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇది ఇలా ఉండగా, తన చిరకాల మిత్రుడు ఫర్హాన్ ఖాన్ ను ఇటీవలే మోనాలిసా పెళ్లి చేసుకున్నారు. కేరళలోని తిరువనంతపురంలో వీళ్ళ వివాహం గ్రాండ్ గా జరిగింది. సరిగ్గా సంవత్సరం కిందట మహారాష్ట్రకు చెందిన నటుడు ఫర్హాన్ ఖాన్ , మోనాలిసాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రేమించుకుని, లేటెస్ట్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహాన్ని మోనాలిసా ఫ్యామిలీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.






