Sashivadane: రిలీజ్‌కు సిద్ధమైన లేటెస్ట్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీ

by Chukka Sudharani |

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీ ‘శశి వదనే’ (Sashivadane).

Sashivadane: రిలీజ్‌కు సిద్ధమైన లేటెస్ట్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీ
X

దిశ, సినిమా: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీ ‘శశి వదనే’ (Sashivadane). గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోగా.. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ‘శశివదనే’ చిత్రం దసరా స్పెషల్‌గా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నట్లు తెలిపారు నిర్మాతలు. ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘శశి వదనే’ మూవీలో శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story