Vinayak: ఎప్పుడు నవ్వుతూ ఉండే ప్రభాస్ కూడా ఆరోజు బాధపడ్డాడు

by Pulgam srinivas |

వినాయక్ మాట్లాడుతూ.. 'బాహుబలి 1' విడుదలైన తర్వాత దానికి వచ్చిన టాక్ కారణంగా మొదటి రెండు, మూడు రోజులు ప్రభాస్, రాజమౌళి చాలా బాధపడ్డారని ఈ దర్శకుడు చెప్పుకొచ్చారు.

Vinayak: ఎప్పుడు నవ్వుతూ ఉండే ప్రభాస్ కూడా ఆరోజు బాధపడ్డాడు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరైన వి.వి. వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. తాజాగా వినాయక్ మాట్లాడుతూ... ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైన తర్వాత ఆ చిత్ర బృందం వారు ఓ పార్టీ ఏర్పాటు చేసి దానికి ఇండస్ట్రీకి సంబంధించిన వారిని పిలిచారు. ఆ పార్టీలో ప్రభాస్‌తో పాటు రాజమౌళి కూడా చాలా సాడ్‌గా ఉన్నారు. సాధారణంగా ప్రభాస్ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు, కానీ ఆ రోజు మాత్రం ఆయన కూడా చాలా డల్ గా కనిపించాడు.

అలా ఉండడానికి ప్రధాన కారణం ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైన తర్వాత దానికి మొదట్లో పెద్ద ఎత్తున నెగిటివ్ టాక్ రావడమే. దాంతో వారిద్దరూ చాలా బాధపడ్డారు. అయితే ఆ తర్వాత ఆ సినిమాకు కామన్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ రావడం ప్రారంభమైంది. దాంతో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన తర్వాత మొదటి రెండు, మూడు రోజులు వారు ఎంతో బాధపడ్డారని, కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ కావడంతో చాలా ఆనందపడ్డారని వినాయక్ తెలిపారు. ఇకపోతే, చాలా సంవత్సరాల క్రితం వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్ ‘యోగి’ చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇక వినాయక్, రాజమౌళి మంచి స్నేహితులు. ఒకానొక సమయంలో వీరిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగారు.

Next Story