- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి రాబోతున్న విక్రమ్ ‘వీర ధీర శూరన్-2’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ‘పొన్నియన్ సెల్వన్-2’ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) ‘పొన్నియన్ సెల్వన్-2’ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఆ తర్వాత ‘తంగలాన్’ (Thangalan)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే గత ఏడాది విడుదలై అయిన ఈ మూవీ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఇదే ఫామ్‌తో విక్రమ్ ‘వీర ధీర శూరన్-2’(Veera Dheera Sooran)లో నటించారు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దుషార విజయన్ హీరోయిన్‌గా నటించింది.
అలాగే విజయ్ సేతుపతి(Vijay Sethupathi), ఎస్ జే సూర్య, సూరజ్ వెంజర మూడు వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 27న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ‘వీర ధీర శూర-2’ నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 24 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.






