- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో విజయ్ విక్టరీ..ప్రకాష్ రాజ్ వివాదస్పద పోస్ట్ !
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైన సోషల్ మీడియా వేదికగా నటుడు ప్రకాష్ రాజు స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎన్నికల్లో టీవీకే పార్టీకి 107 స్థానాలు దక్కాయి. దీంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలిచింది. ఇక ముఖ్యమంత్రి కూడా విజయ్ కాబోతున్నారు. రెండు చోట్ల విజయ్ ఘన విజయం సాధించగా, అతనికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తమిళనాడు ఎన్నికలపై ప్రకాష్ రాజ్ పోస్ట్
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైన సోషల్ మీడియా వేదికగా నటుడు ప్రకాష్ రాజు స్పందించారు. తమిళనాడు చరిత్రలో కామరాజు ఓడిపోయారు.. ఇప్పుడు స్టాలిన్ కూడా ఓడిపోయినట్లు గుర్తు చేశారు. సమాజం కేవలం అభిమానులమయం అయిపోయిందంటూ విజయ్ విజయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
అభిమానులు, సినీ గ్లామర్ మొత్తం విజయ్ కి సపోర్ట్ చేయడంతో అతని బలం పెరిగిందన్నారు. రాజకీయ చైతన్యం కలిగించే వారి పని ఎల్లప్పుడూ ప్రతిపక్ష పార్టీ పనేనని.. మన ప్రయాణం కొనసాగిద్దాం అంటూ వ్యాఖ్యానించారు. అంటే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అతని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా ముందుకు సాగుతానని హింట్ ఇచ్చారు ప్రకాష్ రాజ్.
Tamilnadu Elections வணக்கம் தமிழ்நாடு.. காமராஜர் தோற்றார். மு. க. ஸ்டாலின் தோற்றிருக்கிறார். சமூகம் ரசிகர் மயமாகி இருக்கிறது. அரசியல் மயமாகவில்லை என்பது நிரூபணமாகிறது. அரசியல் விழிப்புணர்வு செய்பவர்களின் பணி என்பது எப்போதும் எதிர்க்கட்சி…
— Prakash Raj (@prakashraaj) May 4, 2026






