- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుల్ ఖుషీలో విజయ్ నిర్మాతలు.. 200 కోట్లు టార్గెట్
'జన నాయగన్', 'టాక్సిక్' చిత్రాల ఓటీటీ హక్కులను 200 కోట్లకి అమ్మాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో, తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి దళపతి విజయ్ కొంతకాలం క్రితం జన నాయగన్ చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ చిత్ర విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొదట ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ సంస్థ దక్కించుకోవాలని భావించినా, మూవీ వరుసగా వాయిదా పడుతుండడంతో ఈ సంస్థ వెనక్కు తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జీ5 ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకునే ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇక తాజాగా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది.
దీంతో అమెజాన్ సంస్థ మళ్లీ జన నాయగన్ హక్కుల కోసం ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది. ఇదే సంస్థ యష్ హీరోగా రూపొందుతున్న టాక్సిక్ చిత్రాన్ని కూడా నిర్మించింది. టాక్సిక్ మూవీ ఓటీటీ హక్కులను కూడా అమెజాన్ సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ రెండు సినిమాల ఓటీటీ హక్కులను కలిపి 200 కోట్ల రూపాయలకు అమ్మాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఈ నిర్మాణ సంస్థకు ఇది సూపర్ డీల్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన జన నాయగన్, టాక్సిక్ చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా వరుసగా వాయిదా పడుతూ రావడం గమనార్హం.






