- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ పై కుట్రలు...రంగంలోకి రాములమ్మ.. తాట తీస్తానంటూ !
టాలీవుడ్ పై ( Tollywood) కుట్రలు చేస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్సీ, నటి విజయశాంతి ( Vijayashanthi) వార్నింగ్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ పై ( Tollywood) కుట్రలు చేస్తున్న వారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్సీ, నటి విజయశాంతి ( Vijayashanthi) వార్నింగ్ ఇచ్చ్చారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రాములమ్మ... ఎమ్యెల్సీ రాగానే ఇండస్ట్రీ కాపాడుతానంటూ సంచలన ప్రకటన చేశారు. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసే వారిపై నటి విజయశాంతి సీరియస్ అయ్యారు. అర్జున్ s/o వైజయంతి ( Arjun s/o Vyjayanthi) సక్సెస్ మీట్ లో విజయశాంతి మాట్లాడారు. సినిమాను ఖూని చేద్దామనుకునే వారికి వార్నింగ్ ఇచ్చారు విజయశాంతి. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసే వారు తమ పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు విజయశాంతి.
కొంత మంది కావాలనే సినిమాలను ఇబ్బండిపెడుతున్నారని మండి పడ్డారు విజయశాంతి. ప్రతి ఒక్క సినిమా ఆడాలి అనేది మా కోరిక అన్నారు. బాగున్న సినిమాను బాగా లేదని, బాగా లేని సినిమాను (MOIVE) బాగుందని ప్రచారం చేయడం ఏంటీ అంటూ నిప్పులు చెరిగారు విజయశాంతి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎన్నో ఆశలతో పరిశ్రమ లోకి వస్తారని చెప్పారు విజయశాంతి.
సినిమా నచ్చకపోతే చూడకండి, నిశ్శబ్దంగా ఉండండి అని కోరారు విజయశాంతి. సినిమా నచ్చ లేదని ఖూని చేద్దామని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని ఫైర్ అయ్యారు విజయశాంతి. థియేటర్లలో ప్రజలు సినిమా చూసి అద్భుతంగా ఉందంటున్నారన్నారు విజయశాంతి. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం అంటూ మండిపడ్డారు. సినిమాలను మనస్ఫూర్తిగా దీవించడం నేర్చు కోండన్నారు విజయశాంతి ( Vijayashanthi). కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలను నాశనం చేసేవాళ్లను జీవితంలో క్షమించకూడదని పేర్కొన్నారు.






