రూ.60 కోట్లకు థగ్ లైఫ్ టెలివిజన్ రైట్స్ దక్కించుకున్న ఛానల్

by Naga Rani Yarlagadda |

స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Manirtnam) దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో త్రిష, శింబు, ఐశ్వర్యలక్ష్మి, నాజర్, అభిరామి వంటి అగ్రతారాగణం నటించిన సినిమా థగ్ లైఫ్.

రూ.60 కోట్లకు థగ్ లైఫ్ టెలివిజన్ రైట్స్ దక్కించుకున్న ఛానల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Manirtnam) దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో త్రిష, శింబు, ఐశ్వర్యలక్ష్మి, నాజర్, అభిరామి వంటి అగ్రతారాగణం నటించిన సినిమా థగ్ లైఫ్. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన సాంగ్ తో మేకర్స్ ఫుల్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తుండగా.. అన్ని భాషల్లోనూ ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. ఈనెల 16న థగ్ లైఫ్ ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా.. భారత్ - పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈవెంట్ ను వాయిదా వేసింది. త్వరలోనే మరో తేదీ వెల్లడిస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది.

కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిని ప్రొడక్షన్ హౌజ్ రెడ్ జెయింట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న థగ్ లైఫ్ టెలివిజన్ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడయ్యాయి. విజయ్ టీవీ.. ఈ చిత్రం టెలివిజన్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు తమిళ ఇండస్ట్రీ తెలిపింది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ రూ.150 కోట్లకు ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా.. నాయగన్ సినిమా తర్వాత మణిరత్నం - కమల్ కాంబోలో వస్తోన్న థగ్ లైఫ్ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

Next Story