Vijay Thalapathy: ఫైనల్ షెడ్యూల్‌కు సిద్ధమైన స్టార్ హీరో సినిమా.. పోస్ట్ వైరల్ కావడంతో ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay Thalapathy) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జననాయగన్’ (Jananayagan).

Vijay Thalapathy: ఫైనల్ షెడ్యూల్‌కు సిద్ధమైన స్టార్ హీరో సినిమా.. పోస్ట్ వైరల్ కావడంతో ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay Thalapathy) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జననాయగన్’ (Jananayagan). హెచ్ వినోద్ (H. Vinod) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఇందులో మమిత బైజు (Mamita Baiju), బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విజయ్ సినీ కెరీర్‌లో లాస్ట్ సినిమా కాగా.. ‘జననాయగన్’ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

అలాగే.. విజయ్ రాజకీయ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తీస్తున్న మూవీ కావడంతో ఇందులో రాజకీయానికి సంబంధించిన సీన్స్ హై లెవల్‌లో ఉండనున్నాయని టాక్. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చింది. కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ‘జననాయగన్’ అవుట్‌డోర్ షూట్ (Outdoor shoot) కొడైకెనాల్‌(Kodaikanal)లో జరగనుందట. అలాగే ఈ షెడ్యూల్ మే మొదటి వారంలో ప్రారంభమవుతుందని తెలుస్తుండగా.. ఇదే ఈ మూవీ చివరి షెడ్యూల్ అని సమాచారం. ఇక ఈ షూటింగ్‌తో ‘జననాయగన్’ సినిమా కంప్లీట్ అవుతుందని తెలుస్తుండగా.. వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతుంది.

Next Story