- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Vijay Sethupathi: పూరీ జగన్నాథ్‌తో సినిమా ఎందుకు అంటూ విమర్శలు.. విజయ్ సేతుపతి రియాక్షన్‌కు అంతా షాక్!

దిశ, సినిమా: వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) రీసెంట్‌గా ఓ బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో పూరీ చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబోపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. అలాగే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు (Tabu) కూడా నటిస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, స్టార్ హీరోయిన్ చార్మీ కౌర్ (Charmi Kaur) నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నెట్టింట ఎన్నో ట్రోల్స్, విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస ప్లాప్‌లు తన ఖాతాలో వేసుకుంటున్న డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి సినిమా ఏంట్రీ అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వార్తలపై విజయ్ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Interesting comments) చేశారు. ‘నేను, పూరీ జగన్నాథ్ చేయబోయే ప్రాజెక్ట్ షూటింగ్ జూన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే.. ఈ సినిమా పట్ల కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో చేసిన సినిమాల ఫలితాల ఆధారంగా నేను డైరెక్టర్‌ను జడ్జ్ చేయను. నాకు చెప్పిన స్క్రిప్ట్ నచ్చితేనే ఆ సినిమా చేస్తాను. డైరెక్టర్ పూరీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అందుకే ఓకే చేశాను. బలమైన సినిమాలు చేయడమే నా బలం’ అంటూ స్ట్రాంగ్ ఆన్సర్ (Strong Answer) ఇచ్చాడు విజయ్ సేతుపతి.