- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జాకీ’ టీజర్ విడుదల చేసిన విజయ్ సేతుపతి
PK7 స్టూడియోస్ నిర్మిస్తున్న కొత్త తమిళ సినిమా ‘జాకీ (Jockey)’ టీజర్ విడుదలైంది. ఈ సినిమా మధురై గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. చెన్నైలో జరిగిన వీధి తిరువిళా – 13వ ఎడిషన్ కార్యక్రమంలో టీజర్‌ను విడుదల చేశారు.

దిశ, సినిమా : PK7 స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమా ‘జాకీ’ టీజర్ విడుదలైంది. ఈ సినిమా మధురై గ్రామీణ నేపథ్యంలో రూపొందగా.. చెన్నైలో జరిగిన వీధి తిరువిళా – 13వ ఎడిషన్ కార్యక్రమంలో టీజర్‌ను విడుదల చేశారు. 2021లో వచ్చిన ‘మడ్డి’ సినిమా తర్వాత.. PK7 స్టూడియోస్, దర్శకుడు డా. ప్రగభల్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రాబోతుండటంతో మంచి బజ్ క్రియేట్ అయింది. యువన్ కృష్ణ, రిదాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించగా.. శక్తి బాలాజీ సంగీతం అందించారు. టీజర్‌ను గమనిస్తే.. మధురై నేపథ్యంలో సాగే ‘జాకీ’ కథ గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ పోరాట సన్నివేశాలు అన్ని సహజంగా తెరకెక్కించడానికి మూడేళ్లుగా ఆ ప్రాంతంలో రీసెర్చ్ చేసింది చిత్ర యూనిట్. నేటివిటీ మిస్ అవ్వకుండా సన్నివేశాలు చిత్రీకరణ జరగ్గా.. నటీనటులు నిజమైన పొట్టేలుతో శిక్షణ తీసుకొని నటించడం విశేషం.






