Vijay Sethupathi: క్రేజీ టైటిల్‌తో వచ్చేస్తున్న విజయ్ రగ్గడ్ లవ్ స్టోరీ.. నెట్టింట పోస్టర్ వైరల్

by Chukka Sudharani |

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Vijay Sethupathi: క్రేజీ టైటిల్‌తో వచ్చేస్తున్న విజయ్ రగ్గడ్ లవ్ స్టోరీ.. నెట్టింట పోస్టర్ వైరల్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఉప్పెన’ సినిమాలో విలన్‌గా నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో పాటు.. తన పర్ఫామెన్స్‌తో ఇక్కడ కూడా స్పెషల్ ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈయన తెలుగులో హీరోగా మరో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath) డైరెక్షన్స్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతోంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న విజయ్ సేతుపతి తాజాగా తమిళ్‌లో మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించారు.

పాండిరాజ్ (Pandiraj) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ‘తలైవాన్.. తలైవీ’ (Thalaivan-Thalaivii) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా రగ్గడ్ లవ్ స్టోరీ (Rugged Love Story) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతూ.. విశేష స్పందన సొంతం చేసుకుంటోంది. కాగా.. మొదటిసారి విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధం అవుతుండటంతో.. వీళ్ల క్రెమిస్ట్రీ చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story