- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Sethupathi: వాళ్లు మనలాగా నార్మాల్ పీపుల్ కాదు.. ఆకట్టుకుంటోన్న ‘సార్.. మేడమ్’ టైటిల్ టీజర్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఈయన తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. దీంతోపాటు విజయ్ సేతుపతి, పాండిరాజ్ దర్శకత్వంలో ‘తలైవాన్ తలైవి’ మూవీ చేస్తున్నారు. ఇందులో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రగ్గడ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి, త్యాగరాజన్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
‘మీ అమ్మానాన్నలను వదిలేసి నన్ను నమ్ముకుని వచ్చావు.. మేము కూడా నిన్ను ఇంత బాగా చూసుకులేరు అని వాళ్లు అనుకునేలా నేను నిన్ను మహారాణిలా చూసుకుంటా’ అంటూ విజయ్ సేతుపతి డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో ఓ వంట గదిలో విజయ్, నిత్యా మీనన్ వంట చేసుకుంటూ కనిపిస్తారు. ‘ఇదేనా మహారాణిలా చూసుకోవడం అంటే’ అంటూ నిత్యా మీనన్ విజయ్‌తో గొడవ పడుతూ వంట చేస్తుండగా.. వారిద్దరు ఒకనొకరు సార్.. మేడమ్.. అని పిలుచుకుంటారు. ఇక ఈ మూవీకి ‘సార్.. మేడమ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ.. జులై 25 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ‘రేయ్.. వాళ్లు మనలాగా నార్మల్ పీపుల్ కాదు గాయ్స్.. చెప్తే అర్థం చేసుకోవాలి ప్లీజ్’ అంటూ ముగిసిన ఈ టీజర్ నెట్టింట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. లింక్






