సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌పై అప్డేట్ ఇచ్చిన విజయ్.. ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

‘మహారాజ’ సీక్వెల్‌పై అప్డేట్ ఇచ్చిన విజయ్ సేతుపతి.

సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌పై అప్డేట్ ఇచ్చిన విజయ్.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: తెలుగు, తమిళం అంటూ భాషతో సంబంధం లేకుండా ఫుల్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో విజయ్ సేతుపతి.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రజెంట్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తూ.. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే.. విజయ్ సేతుపతి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘మహారాజ’ ఒకటి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీకి ‘కురంగు బొమ్మై’ ఫేమ్ నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించాడు. 2024లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు విజయ్. ‘మహారాజ’ సీక్వెల్‌పై క్లారిటీ ఇస్తూ.. ‘నితిలన్‌ సామినాథన్‌ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు. త్వరలో నరేషన్‌ను వింటాను. ఈ ప్రాజెక్టు గురించి చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నాను’ అని తెలిపాడు. దీంతో విజయ్‌ సేతుపతి అభిమానులతోపాటు, సినిమా ప్రియులు కూడా పండుగ చేసుకుంటున్నారు.

Next Story