- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకు వీడియోల వివాదం.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి..
విజయ్ సేతుపతి కొడుకు సూర్య నటనా అరంగేంట్రం హ్యాపీగా జరిగింది. తొలి చిత్రం ఫీనిక్స్ విజయవంతం కావడంతో సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. అయితే ఈ సందర్భంగా ఆడియన్స్‌కు క్షమాపణలు చెప్పాడు సేతుపతి. మూవీ

దిశ, వెబ్ డెస్క్: విజయ్ సేతుపతి కొడుకు సూర్య నటనా అరంగేంట్రం హ్యాపీగా జరిగింది. తొలి చిత్రం ఫీనిక్స్ విజయవంతం కావడంతో సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. అయితే ఈ సందర్భంగా ఆడియన్స్‌కు క్షమాపణలు చెప్పాడు సేతుపతి. మూవీ విడుదలకు ముందు సోషల్ మీడియాలో సూర్యకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయని.. వీటిని తొలగించమని ఒత్తిడి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై తండ్రీకొడుకులపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ఓ జర్నలిస్ట్ సక్సెస్ మీట్ సందర్భంగా ఇదే ప్రశ్నను అడిగాడు. అటువంటి చర్యలు తాను చేయలేదని.. మరొకరు చేసి ఉండొచ్చని.. అయినా ఆ పనితో హర్ట్ అయ్యారు కాబట్టి బాధపడిన వారందరికీ క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించాడు. కానీ అసలు ఆ వీడియోలు ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. అవి సూర్య వ్యక్తిగత వీడియోలా లేక ఏదైనా అబ్యూజింగ్ కంటెంట్ అయ్యుంటుందా అనే క్లారిటీ లేకపోవడమే అసలు వివాదానికి కారణమైందని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి సారీ చెప్పడంతో వివాదాన్ని సమర్థవంతంగా ఎండ్ చేశాడు సేతుపతి.






