- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తిరుచ్చి ఈస్ట్’కు విజయ్ రాజీనామా..? త్రిషకు బదులు రేసులోకి ఆ మాజీ IAS
రెండు చోట్ల గెలిచిన టీవీకే అధినేత విజయ్, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి తిరుగులేని విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్ (Vijay), ఇప్పుడు ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆయన ఖాళీ చేయబోయే తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రచారంలో త్రిష పేరు..
తొలుత తిరుచ్చి ఈస్ట్ (Tiruchi East) ఉప ఎన్నికలో విజయ్ సన్నిహితురాలు, నటి త్రిష (Trisha)ను బరిలోకి దింపుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా గ్లామర్ కంటే పాలనా అనుభవం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే, అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన మాజీ ఐఏఎస్ అధికారి సగాయం (Sagayam) ను తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయించాలని విజయ్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సగాయం తన సర్వీసులో నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా గ్రానైట్ కుంభకోణం వంటి విషయాల్లో ఆయన చేసిన పోరాటం ప్రజల్లో ఆయనపై గౌరవాన్ని పెంచింది. ఇక కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి సగాయం వంటి అనుభవజ్ఞులైన అధికారుల సలహాలు, క్రియాశీల భాగస్వామ్యం అవసరమని విజయ్ బలంగా నమ్ముతున్నారు. ఆయన ‘తిరుచ్చి ఈస్ట్’ నియోజకవర్గానికి రాజీనామా చేసిన వెంటనే ఉప ఎన్నికలో సగాయం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






