ప్రధాని మోదీని కలిసిన విజయ్‌, రష్మిక.. రిసెప్షన్‌కు ఆహ్వానం అందజేత

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-27 06:56:42  IST  )

టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు సాదరంగా ఆహ్వానించారు.

ప్రధాని మోదీని కలిసిన విజయ్‌, రష్మిక.. రిసెప్షన్‌కు ఆహ్వానం అందజేత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ (Vijaya Devarakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కొత్త జంట న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం హైదరాబాద్‌లో మార్చి 4న బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణలో జరగనున్న తమ రిసెప్షన్‌కు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. అయితే తన బిజీ షెడ్యూల్ కారణంగా రిసెప్షన్ వేడుకకు ప్రధాని హాజరు కాలేకపోతున్నట్లు తెలిపినట్లు సమాచారం. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని విజయ్, రష్మిక దంపతులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్రాండ్ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.

కాగా, విజయ్ కోసం తెలుగు సంప్రదాయం ప్రకారం, రష్మిక మూలాలున్న కూర్గి (Kodava) పద్ధతిలో ఈ వివాహ వేడుకలు జరిగాయి. సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ.. ‘నా బెస్ట్ ఫ్రెండ్‌ను నా భార్యగా చేసుకున్నా’ అంటూ విజయ్ భావోద్వేగంగా పోస్ట్ చేయగా, అభిమానులు ‘VIROSH’ జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story