'రణబాలి' సెట్స్‌పై విజయ్–రష్మిక సందడి… నూతన దంపతులకు టీమ్ ప్రత్యేక సెలబ్రేషన్స్

by Pulgam srinivas |

'రణబాలి' సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్–రష్మిక జంట.. ప్రత్యేక శుభాకాంక్షలతో ఘన స్వాగతం పలికిన మూవీ టీమ్.

రణబాలి సెట్స్‌పై విజయ్–రష్మిక సందడి… నూతన దంపతులకు టీమ్ ప్రత్యేక సెలబ్రేషన్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటీనటులు అయిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న చాలా కాలం ప్రేమించుకొని కొంతకాలం క్రితమే గ్రాండ్‌గా వివాహం జరుపుకున్నారు. వివాహం అనంతరం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున రిసెప్షన్ కూడా నిర్వహించారు. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉన్న ఈ జంట తాజాగా తిరిగి సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వివాహం తర్వాత మొట్టమొదటిసారి వీరు సినిమా షూటింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ‘రణబాలి’ యూనిట్ వీరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలబ్రేషన్స్ నిర్వహించింది. విజయ్–రష్మిక ఈ సినిమాకు సంబంధించిన గెటప్‌లో ఉండగా, మూవీ బృందం వారికి బొకే అందించి, కేక్ కట్ చేయించి సెట్స్‌లోకి సాదరంగా ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మూవీ బృందం సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.




Next Story