- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ ‘జన నాయకుడు’ కు కొత్త చిక్కులు.. రిలీజ్ కావడం కష్టమేనా!
విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయకుడు. ఈ సినిమా జనవరి 9వ తేదీన రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయకుడు ( Jana Nayakudu). ఈ సినిమాకు వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తోంది. విజయ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా మెరువనున్నారు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపిస్తారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే విజయ్ సినిమాకు కొత్త చిక్కులు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా జనవరి 9వ తేదీన రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదని టాక్ నడుస్తోంది. కొన్ని రోజుల కిందట U/A సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు సిఫారస్ చేసిందని, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని టీవీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నిర్మల్ కుమార్ వెల్లడించారు. ఈ మూవీని ఆపడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఆ అడ్డంకులను అధిగమించి, మూవీని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.






