విజ‌య్ ఫ్యాన్స్ ఓవ‌రాక్ష‌న్‌..పరాశక్తి మూవీ బ్యానర్లు చింపేసి ర‌చ్చ !

by velandi.Saikiran |   (  Updated:2026-01-05 03:54:42  IST  )

‘జన నాయకుడు’ ట్రైలర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి బ్యానర్లు చించేశారు విజయ్ దళపతి అభిమానులు.

విజ‌య్ ఫ్యాన్స్ ఓవ‌రాక్ష‌న్‌..పరాశక్తి మూవీ బ్యానర్లు చింపేసి ర‌చ్చ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సంక్రాంతి పండుగ వస్తోన్న నేపథ్యంలో వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సంక్రాంతికి దాదాపు అర డజన్ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఈ లిస్టులో విజయ్ చేసిన ‘జన నాయకుడు’ అలాగే శివ కార్తికేయన్ చేసిన పరాశక్తి సినిమాలు ఉన్నాయి. జనవరి 9వ తేదీన ‘జన నాయకుడు’ సినిమా రిలీజ్ కానుండగా, ఒక్కరోజు గ్యాప్ లోనే పరాశక్తి సినిమా రాబోతోంది. దీంతో తమిళ ఇండస్ట్రీలో విజయ్, శివ కార్తికేయన్ మూవీస్ మధ్య పోటీ నెలకొంది.

అయితే ఇలాంటి నేపథ్యంలో విజయ్ దళపతి అభిమానులు కాస్త ఓవరాక్షన్ చేశారు. ‘జన నాయకుడు’ సినిమా ట్రైలర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో శివ కార్తికేయన్ నటించిన పరాశక్తి బ్యానర్లు చించేశారు. మరికొన్ని బ్యానర్లను కిందపడేసి తొక్కేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై శివ కార్తికేయన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమ హీరో బ్యానర్లు తొలగించడం దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సంక్రాంతి బరిలో ప‌రాశ‌క్తి సినిమా హిట్ అవుతుందని విజయ్ ఫ్యాన్స్ కు కౌంటర్ ఇస్తున్నారు. క్లిక్

Read More..

విజయ్ ‘జన నాయకుడు’ కు కొత్త చిక్కులు.. రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మేనా!

Next Story