- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా విడుదల వాయిదా.. పోస్ట్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రణబాలి’. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం 1854-1878 మధ్య కాలంలో బ్రిటీష్ ఇండియాలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ పీరియాడి్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. ఇందులో రణబాలి అనే వీరుడిగా విజయ్ నటిస్తుండగా.. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనున్నారు. సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11న వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. విజయ్, రష్మిక క్రేజీ కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో అభిమానులు కూడా ఈ డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయితే, గత కొద్దిరోజులుగా ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదని, వాయిదా పడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ వాయిదా వార్తలకు బలం చేకూరుస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, గతంలో ఇచ్చిన పోస్టర్లలో సెప్టెంబర్ 11 రిలీజ్ డేట్‌ను స్పష్టంగా వేసిన మేకర్స్.. ఈ బర్త్‌డే పోస్టర్‌లో మాత్రం విడుదల తేదీని ఎక్కడా ప్రస్తావించలేదు. రిలీజ్ డేట్ మిస్ అవ్వడంతో సినిమా వాయిదా పడటం ఖాయమని, ఈ విషయాన్ని మేకర్స్ ఈ విధంగా హింట్ ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వార్తతో విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






