విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ వాయిదా.. అయోమయంలో రౌడీ హీరో ఫ్యాన్స్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తీరిక లేకుండా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ వాయిదా.. అయోమయంలో రౌడీ హీరో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తీరిక లేకుండా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘కింగ్‌డమ్’(Kingdom) సినిమాతో రాబోతున్నారు. దీనిని గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri)తెరకెక్కిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక విజయ్ 12న చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మే 30న థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై అందరి దృష్టిని ఆకర్శించాయి.

ఈ టీజర్లకు తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రణ్‌బీర్ చెప్పడం విశేషం. ఈ మూవీ షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయిందని రిలీజ్ కూడా వాయిదా పడినట్లు గత కొద్ది రోజుల నుంచి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో అవి చూసిన విజయ్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో.. తాజాగా విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ వాయిదాపై క్లారిటీ ఇచ్చారు. ఆయన షూటింగ్ పూర్తి చేసుకుని ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. అలాగే తొందరలోనే ‘కింగ్‌డమ్’ ఫస్ట్ సింగిల్ కూడా రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story