Vijay Deverakonda: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘కింగ్‌డమ్’ విడుదలపై కీలక ప్రకటన షేర్ చేసిన చిత్రబృందం

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-14 09:52:22  IST  )

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’(Kingdom).

Vijay Deverakonda: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘కింగ్‌డమ్’ విడుదలపై కీలక ప్రకటన షేర్ చేసిన చిత్రబృందం
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’(Kingdom). అయితే ఇందులో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ (Naga Vamsi)నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కింగ్‌డమ్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ లభించగా.. ప్రేక్షకులు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ మే 30న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈక్రమంలో.. తాజాగా, ‘కింగ్‌డమ్’ సినిమా వాయిదా పడినట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ కీలక ప్రకటనను విడుదల చేశారు. ‘‘ప్రేక్షకులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాం. మా సినిమా అనుకున్న విధంగా మే 30న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. అసలు ఆ తేదీకి విడుదల చేయాలని కట్టుబడి ఉండటానికి అన్ని అవకాశాలను మేమే పరిశీలించాము. కానీ దేశంలో ఇటీవల జరిగిన ఊహించని సంఘటనలు, ప్రస్తుత వాతావరణం కారణంగా ప్రమోషన్స్, వేడుకలకు చాలా కష్టం అవుతుంది. ఈ నిర్ణయం ‘కింగ్‌డమ్’ సాధ్యమైనంత ఉత్తమంగా అందించడానికి మాకు సహాయపడుతుందని మేము నమ్ముతున్నాము.

సృజనాత్మక నైపుణ్యం, స్పూర్తితో ఇది జూలై 4న మీ ముందుకు తీసుకురాబోతున్నాము. మీ మద్దతును మేము నిజంగా విలువైనదిగా భావిస్తున్నాము. అలాగే మీ ప్రేమను అందుకుంటామని ఆశిస్తున్నాము. అయితే ఈ మార్పును సాధ్యం చేయడంతో వారి అవగాహన, మద్దతును ఇచ్చినందుకు దిల్ రాజు, నితిన్ గార్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.. జై హింద్’’ అని రాసుకొచ్చారు. అలాగే ‘కింగ్‌డమ్’ జూలై 4న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అది చూసిన వారంతా నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ సినిమా నితిన్ నటించిన ‘తమ్ముడు’ పోటీగా రాబోతుండటం విశేషం. ఇక ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Click For Tweet..

Next Story