- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Deverakonda: ‘కింగ్‌డమ్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆనందంలో రౌడీ హీరో ఫ్యాన్స్!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ (Kingdom) చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ (Kingdom) చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి నెలలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ (Teaser) విడుదల కాగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో విజయ్ మాస్ యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే.. అప్పటి నుంచి ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా.. ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయిందంటూ పలు వార్తలు కూడా నెట్టింట వైరల్ కావడంతో.. షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రౌడీ హీరో ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందబోతున్నట్లు తెలుస్తుంది. ‘కింగ్‌డమ్’కు సంబంధించిన ఫస్ట్ సింగిల్(First single)ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు పాటను కూడా ఈ వారంలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారండంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ‘కింగ్‌డమ్’ మూవీ భారీ అంచనాల మధ్య మే 20న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.






