Vijay Deverakonda: ఆమెతో కలిసి కుంభమేళాకు బయలుదేరిన విజయ్ దేవరకొండకు ఊహించని అనుభవం.. అయ్యో పాపం!

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-08 13:13:37  IST  )

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాకు జనాలు ఎగబడుతున్నారు.

Vijay Deverakonda: ఆమెతో కలిసి కుంభమేళాకు బయలుదేరిన విజయ్ దేవరకొండకు ఊహించని అనుభవం.. అయ్యో పాపం!
X

దిశ, సినిమా: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళాకు జనాలు ఎగబడుతున్నారు. 144 సంవత్సరాల అనంతరం జరుగుతున్న ఈ మహోత్సవంను చూసేందుకు సినీ ప్రియులతో పాటు ప్రముఖులు సాధారణ భక్తులు ఉత్సాహంగా ఉన్నారు. పనులను పక్కన పెట్టి కుంభమేళాకు వెళ్లి అక్కడ పుణ్నస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఇప్పటికే కుంభమేళాకు చాలామంది సినీ సెలబ్రిటీలు వెళ్లిన విషయం తెలిసిందే.

తాజాగా, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఆయన తన తల్లితో బయలుదేరగా ఆయనకు ఊహించని అనుభవం ఎదురైనట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రయాగ్ రాజ్‌కు బయలుదేరిన ఆయన హైదరాబాద్ విమానాశ్రయంలోనే చిక్కుక్కుపోయినట్లు సమాచారం. ఉదయం 9 గంటల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపం వల్ల విమానం టేకాఫ్ కాకపోవడంతో అక్కడే ఉన్నారు. అయితే ఇందులో విజయ్‌తో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో విజయ్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇక అది చూసిన వారు అయ్యో పాపం అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే విమానాశ్రమంలోకి తల్లితో కలిసి వెళ్తున్న విజయ్ వీడియోను షేర్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వీడీ-12’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో రాబోతుండగా.. ఇందులో శ్రీలీల(Sreeleela ) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం గ్రాండ్ మార్చి 28న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Next Story