నాకు పేరు స్వామియే పెట్టారు! సత్యసాయితో చిన్ననాటి ఫోటో షేర్ చేసిన విజయ్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు.

నాకు పేరు స్వామియే పెట్టారు! సత్యసాయితో చిన్ననాటి ఫోటో షేర్ చేసిన విజయ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు. స్వామి తనకు ‘విజయ్ సాయి’ అనే పేరు పెట్టిన విషయాన్ని మొదటిసారిగా వెల్లడించారు. ఆదివారం ఎక్స్‌ (ట్విటర్) వేదికగా విజయ్ దేవరకొండ చేస్తూ.. ’Happy Birthday Swami. నాకు నెలల వయసులో ఉన్నప్పుడే ‘Vijay Sai’ అనే పేరు మీరు పెట్టారు. ఆ పేరు ప్రతిరోజూ నిలబెట్టుకునేందుకు నేను కృషి చేస్తున్నాను. మా చదువుకు, మా పెరుగుదలకు మీరు ఇచ్చిన రక్షితమైన వాతావరణం, అనుభవాలు జీవితాంతం మాతోనే ఉంటాయి. మంచి, చెడు సమయాల్లో మీ గురించే ఆలోచిస్తాం. మేము పొందినదానికి ప్రతిగా ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలనే విలువను మీరు మాలో నాటారు. Happy 100th Birthday.. You will live on forever’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అదే పోస్టులో పుట్టపర్తిలో విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో భగవాన్ సత్యసాయిబాబాతో కలిసి దిగిన తన చిన్ననాటి ఫోటోను కూడా షేర్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ట్వీట్ ఇదే..

Next Story