ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో కనిపించిన విజయ్ దేవరకొండ.. ఫొటోస్ వైరల్

by Gantepaka Srikanth |

నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda), నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఇటీవల నిశ్చితార్థం(Vijay - Rashmika Engagement) చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో కనిపించిన విజయ్ దేవరకొండ.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda), నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఇటీవల నిశ్చితార్థం(Vijay - Rashmika Engagement) చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని విజయ్‌ స్వగృహంలో రెండు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరికీ ఇష్టమైన ఓ డెస్టినేషన్ స్పాట్‌లో వివాహానికి సైతం ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే.. నిశ్చితార్థం, పెళ్లిపై ఇంతవరకు అటు విజయ్, ఇటు రష్మిక ఇద్దరూ స్పందించలేదు.. ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ.. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త రింగ్‌తో కనిపించారు. పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని విజయ్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎడమ చేతికి కొత్త రింగ్ ధరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అది ఎంగేజ్‌మెంట్ రింగే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ చిత్రాల్లో విజయ్, రష్మిక కలిసి నటించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి మరో చిత్రంలో నటిస్తున్నారు.

Next Story