- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Deverakonda: మా జర్నీ మొదలైపోయిందంటూ ఆమెతో ఉన్న ఫొటో షేర్ చేసిన విజయ్.. నెటిజన్లు రియాక్షన్ ఏంటంటే?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’(Kingdom).

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’(Kingdom). ఆ సినిమాను సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse)హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే 30న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'హృదయం లోపల' ప్రోమోకి విశేష స్పందన లభించింది. తక్కువ వ్యవధిలోనే 20 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి, పూర్తి గీతం కోసం అందరూ ఎదురుచూసేలా ఉంది. తాజాగా 'హృదయం లోపల' గీతం విడుదలైంది.
విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే భారీ స్పందనను సొంతం చేసుకుంది. అనిరుధ్ రవిచందర్ తన మనోహరమైన సంగీతంతో 'హృదయం లోపల' గీతాన్ని అందంగా మలిచారు. గాయని అనుమిత నదేశన్ తో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ పాటను ఆలపించడం విశేషం. వీరి మధుర గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ గీతానికి కెకె కవితాత్మకమైన సాహిత్యాన్ని అందించారు. దార్ గై తనదైన కొరియోగ్రఫీతో పాటలోని భావోద్వేగానికి దృశ్యరూపం ఇచ్చారు. ఈ సాంగ్ విడుదల చేస్తూ.. విజయ్ దేవరకొండ ‘‘కొంచెం మృదుత్వం, కొంచెం ప్రేమ.. ఇదంతా వారి ప్రపంచానికి అనుమతి. మీ అందరినీ మేము మా ప్రయాణంలోకి, భావోద్వేగాల్లోకి మా హృదయాలలోకి స్వాగతిస్తున్నాము.’’ అని రాసుకొచ్చారు. అలాగే భాగ్యశ్రీ బోర్సేతో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రష్మిక ‘యానిమల్’ లుక్‌ను షేర్ చేస్తున్నారు.






