ట్రైబల్స్ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ.. ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండంటూ పోస్ట్

by I. Sairam |   (  Updated:2025-05-03 09:43:49  IST  )

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రీసెంట్‌గా ‘రెట్రో’(Retro) ఈవెంట్‌లో ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుతూ ట్రైబల్స్(Tribes) గురించి నోరు జారిన విషయం తెలిసిందే.

ట్రైబల్స్ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ.. ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రీసెంట్‌గా ‘రెట్రో’(Retro) ఈవెంట్‌లో ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుతూ ట్రైబల్స్(Tribes) గురించి నోరు జారిన విషయం తెలిసిందే. ఐదారు వందల ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టుగా చేస్తున్నారేంటని ఉగ్రవాద చర్యపై మాట్లాడాడు. దీంతో ట్రైబల్ ఆర్గనైజేషన్స్ మండిపడ్డాయి. అంతే కాకుండా ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా ఈ వివాదం మీద విజయ్ దేవరకొండ స్పందిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.

‘రెట్రో ఈవెంట్‌లో నేను మాట్లాడిన మాటలతో కొంత మంది హర్ట్ అయ్యారనే విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఆ విషయంపై సిన్సియర్‌గా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎవ్వరినీ ఉద్దేశ్యపూర్వకంగా హర్ట్ చేయాలని అలా మాట్లాడలేదు. మన దేశ సమగ్రతలో భాగమైన ఎంతో ప్రత్యేకమైన గిరిజన తెగల్ని కించపరచాలని నా ఉద్దేశం కాదు. నేను ఆ రోజు మన దేశం గురించి, మన దేశ ఐక్యత గురించి, మనం ఎలా ముందుకు సాగాలి అన్న దాని గురించి మాత్రమే మాట్లాడాను.

ట్రైబ్ అనే పదాన్ని నేను వేరే సెన్స్‌లో వాడాను. నాగరికత మొదలు కాక ముందు, క్లాన్స్, రాజ్యాలు అంటూ ఉండేవి.. అంతే కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి కాదు. 20వ శతాబ్దంలో ఈ ట్రైబ్స్ పదాన్ని పెట్టారు. నా వల్ల, నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి. శాంతి గురించి, అభివృద్ధి గురించి, ఐక్యత గురించి మాత్రమే నేను మాట్లాడాను. డివైడ్ చేయాలనేది నా ఉద్దేశం ఎప్పటికీ కానే కాదు. ఐకమత్యం కోసమే నేను మాట్లాడాను’ అని ఓ నోట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా విజయ్ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో బిజీగా ఉన్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ మే 30న థియేటర్లలో రాబోతోంది.

Next Story