Vijay Deverakonda: రష్మిక పోస్ట్‌కు విజయ్ దేవరకొండ రిప్లై.. ఆన్‌లైన్‌లో ఈ రొమాన్స్ ఏంట్రా బాబు అంటున్న నెటిజన్లు

by Chukka Sudharani |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’.

Vijay Deverakonda: రష్మిక పోస్ట్‌కు విజయ్ దేవరకొండ రిప్లై.. ఆన్‌లైన్‌లో ఈ రొమాన్స్ ఏంట్రా బాబు అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అన్నదమ్ముల సెంటిమెంట్‌తో ఆకట్టుకుంటోన్న ఈ ట్రైలర్‌కు ప్రజెంట్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్‌ను షేర్ చేస్తూ విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్‌పై రష్మిక స్పందిస్తూ.. ‘నేను ఇప్పుడు 31వ తేదీ వరకు వేచి ఉండలేకపోతున్న! విజయ్ దేవరకొండతో కలిసి మీరు సృష్టించిన దానిని చూడటం కోసం నేను ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’ అంటూ తెలిపింది. ఇక ఈ పోస్ట్‌కు విజయ్ రిప్లై ఇస్తూ.. ఎంజాయ్ కింగ్‌డమ్ రుషులు అంటూ లవ్ సింబల్స్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రెండు పోస్టులు వైరల్ కావడంతో.. ‘కింగ్‌డమ్ ట్రైలర్ కంటే మీ రొమాన్స్ బాగుంది’ అని, ‘ఆన్‌లైన్‌లో ఈ రొమాన్స్ ఏంట్రా బాబు’ అని, ‘తొందరగా ఆ పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేసేయండి’ అంటూ తెగ రిప్లైలు ఇస్తున్నారు నెటిజన్లు. లింక్
లింక్

Next Story