- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా డార్లింగ్స్‌తో కాశీ ట్రిప్ అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్.. స్టార్ హీరో భార్య కనిపించడంతో అంతా షాక్!
టాలీవుడ్ రౌడీ హీరో ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే. తన తల్లి మాధవితో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిన ఆయన అక్కడ కాషాయ బట్టలు ధరించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే తన స్నేహితులతో కాశీకి కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుపుతూ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలను పంచుకున్నాడు. ‘‘నేను మా అమ్మతో కలిసి ఈ ఏడాది జరిగిన కుంభమేళాకు వెళ్లాను. మన సంస్కృతి సంప్రదాయాలతో మమేకమవుతూ సాగిన ప్రయాణం.
ఇందులో నా బృందంతో ఎన్నో మధుర జ్ఞాపకాలు పొందుపరుచుకున్నాను. అమ్మతో కలిసి పూజల్లో పాల్గొనడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అదేవిధంగా నాకెంతో ఇష్టమైన నాడార్లింగ్ గ్యాంగ్‌తో కాశీకి వెళ్లొచ్చాను’’ అని రాసుకొచ్చాడు. అయితే ఇందులో డైరెక్టర్ వంశీ పైడిపల్లితో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా హిట్ కోసం తాపత్రయ పడుతున్న ఆయన వరుస సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం రౌడీ హీరో, గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో ‘కింగ్‌డమ్’(Kingdom) మూవీ చేస్తున్నారు.
ఈ చిత్రం ఆయన 12వ చిత్రంగా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) విజయ్ సరసన రొమాన్స్ చేయనుంది. షూటింగ్ జరుపుకుంటున్న VD12 మే 30న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో పాటు విజయ్ ‘VD-14’ మూవీ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.






